హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల స్థలం కబ్జా ప్రజావాణిలో ఫిర్యాదు

NGKL: తాడూరు మండలం సిర్సవాడ ప్రాథమిక పాఠశాల స్థలం కబ్జాకు గురైందని గ్రామస్తులు మండల స్థాయి ప్రజావాణిలో ఎంపీడీవో శోభారాణికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం వెంటనే విచారించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల ఖాళీగా ఉన్నందున దానిని వినియోగంలోకి తేవాలన్నారు.