హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాలు రద్దు చేస్తే ఆందోళనలు చేస్తాం: MLA

SRD: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పథకాలను రద్దు చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.