హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆందోళన'

NLG: తహశీల్దార్ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై సోమవారం నిరసన ఉద్రిక్తంగా మారింది. లాటరీలో ఎంపికైనప్పటికీ ఇళ్లు ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్ ఛాంబర్‌లోకి వెళ్లి బైఠాయించి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు వారికి మద్దతుగా నిలవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.