NGKL: చారకొండ మండలం దొడ్లపల్లి గ్రామంలోని ఈదమ్మ గుడి నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో ఛైర్మెన్ జూపల్లి భాస్కర్ రావు రూ. 50,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి ఎల్లవేళల సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో BRS పార్టీ నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, దిలీప్, అల్లజి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి విరాళం


