హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.