హైదరాబాద్: 28°C
తెలంగాణ

మళ్లీ సొంతగూటికి మహ్మద్ షాకీర్

MBNR: భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామ మైనారిటీ అధ్యక్షుడు మహ్మద్ షాకీర్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం మండల అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్ ఆధ్వర్యంలో తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేత మహ్మద్ సాధిఖ్ పాల్గొన్నారు.