KMR: సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామపంచాయతీలో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వర సర్వే చేపట్టి, అవసరమైన వారి నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. ఆస్మా తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.
తెలంగాణ
'కల్వరాలలో ఆరోగ్య శిబిరం.. జ్వర సర్వే'


