హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల సంఘం సమావేశం

RR: బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచుల సమావేశం జరిగింది. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య, బండారు రామ్మోహన్‌రావు, మల్లయ్య, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.