హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపసర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి: మాజీ సర్పంచ్‌

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనపై మాజీ సర్పంచ్‌ చిన్నపాక శ్రీనివాస్‌ సోమవారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్‌ దొమ్మటి సమ్మయ్య అలియాస్‌ కొమురయ్య దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని ఉపసర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు.