PDPL: పోతనకాలనీలో కోతుల గుంపు దాడిలో సింగరేణి ఉద్యోగి బైరెడ్డి విశాల్‌రెడ్డి గాయపడ్డారు. వకీల్‌పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన క్వార్టర్ నం.685 ముందు ఉండగా సుమారు 10 కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. స్థానికులు వెంటనే 8 ఇంక్లైన్ కాలనీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. కోతుల బెడదను అరికట్టి, కాలనీవాసులకు రక్షణ కల్పించాలని వారు కోరారు.
తెలంగాణ
కోతుల దాడిలో సింగరేణి ఉద్యోగికి గాయాలు


