హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పీహెచ్‌డీ సాధించిన నరోటే ప్రీతమ్'

ADB: ఆదిలాబాద్‌కు చెందిన నరోటే ప్రీతమ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ సాధించారు. ఈ మేరకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ, సిబ్బందితో కలిసి పీహెచ్‌డీ పట్టాను సోమవారం ఆయనకు అందజేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రీతమ్ సాధించిన విజయం పలువురు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు. సాంకేతిక రంగంలో విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.