హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య ఉపకేంద్రంలో పాము కలకలం

MLG: వెంకటాపురం మండలం ఆలుబాక ఆరోగ్య ఉపకేంద్రంలో సోమవారం విషపూరిత పాము ప్రత్యక్షమై కలకలం రేపింది. ఉదయం సిబ్బంది తలుపులు తెరవగానే గదిలో పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతడు వచ్చేలోపే పాము బయటకు వెళ్లి పొదల్లోకి మాయమైంది. నాగపంచమి రోజున పాము కనిపించడంతో స్థానికులు చర్చించుకున్నారు