హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెకన్ల వ్యవధిలోనే యూరియా బుకింగ్స్ పూర్తి

MDK: రామాయంపేట మండలంలో సోమవారం 1,100 బస్తాల యూరియా కేవలం ఒక్క నిమిషంలోనే బుక్ అవ్వడం కలకలం రేపింది. రైతులకు సులువుగా ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ ద్వారా పీఏసీఎస్ రామాయంపేట, కోనాపూర్లకు ఈ స్టాక్ పంపించారు. అయితే, నిమిషం వ్యవధిలోనే బుకింగ్స్ అన్నీ పూర్తవడంతో యూరియా కోసం నిరీక్షిస్తున్న స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.