SRPT: నడిగూడెం మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులు స్వీకరించేందుకు అందుబాటులో ఉన్నారు. అయితే ఈసారి ప్రజావాణికి స్పందన తక్కువగా కనిపించింది. మొత్తం ఒక్క దరఖాస్తు మాత్రమే అందినట్లు ఎంపీడీవో ఎల్. మన్సూర్ నాయక్ తెలిపారు. వచ్చిన వినతిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రజావాణికి ఒక్కటే దరఖాస్తు'


