హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలు పూడ్చి రోడ్డుకు మరమ్మతులు

RR: చింతకుంటపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న వేములనర్వ–కొండారెడ్డిపల్లి జెడ్పీ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డుపై మట్టి పోసి గుంతలను పూడ్చారు. గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంధ్య శ్రీకాంత్, వార్డు సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.