హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయి ప్రజావాణి ప్రారంభించిన కలెక్టర్

NRPT: నారాయణపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రియాంక దీన్ని లాంఛనంగా ప్రారంభించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అమరేంద్ర కృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.