హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొమురం భీమ్ స్మారక భవనానికి మంత్రి భూమి పూజ

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో కొమురం భీమ్ స్మారక భవనాల నిర్మాణానికి సోమవారం మంత్రి ధనసరి సీతక్క భూమిపూజ చేశారు. దాదాపు రూ.1.5 కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి, ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వెల్లడించారు.