హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి జూపల్లిని కలిసిన కంది శ్రీనివాస రెడ్డి

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇంద్రవెల్లి వద్ద ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. అనంతరం మంత్రి జూపల్లితో కలిసి ఉట్నూర్‌కు బయలుదేరారు.