NZB: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్మించిన నూతన మరుగుదొడ్లను గ్రామపంచాయతీ సర్పంచి చెలిమిల శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచి తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పాత బస్టాండ్‌లో కొత్త మరుగుదొడ్లు'


