SDPT: మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మరో ఆరుగురు విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్ చేసిన అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో చేర్యాల సీహెచ్సీకి వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ తెలిపారు. నీరు లేదా ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
తెలంగాణ
కలుషితం కావడం వల్లే అస్వస్థత: డాక్టర్


