హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గే సభ.. మైదానం ప్రక్షాళనపై కాంగ్రెస్ ఆగ్రహం

NRML: ఉత్తరాఖండ్‌ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం మైదానాన్ని ప్రక్షాళన చేయడాన్ని కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్ తీవ్రంగా ఖండించారు. ఖర్గేను అవమానించడం దేశంలోని దళిత, బహుజన సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. కులవివక్షను ప్రోత్సహించే మనువాద భావజాలంపై నిరసన వ్యక్తం చేశారు.