VZM: విజయనగరం పట్టణ ప్రజలకు సారిపల్లిలో ఏర్పాటు చేసిన టిక్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సోమవారం కాలనీ ప్రజలు కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు. కాలనీ ఏర్పాటు చేసి పదేళ్లు దాటినా విద్య, వైద్యం, కరెంట్, రోడ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసి ఏ. వాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
టిక్కో కాలనీలో మౌలిక సదుపాయాలకై నిరసన


