హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ పట్టణాన్నితీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

కృష్ణా: నందిగామ పట్టణాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. పట్టణంలోని పలు రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 1,000 మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో భారీ వృక్షాలను నరికివేసి విక్రయించారని ఆరోపించారు.