ఆంధ్రప్రదేశ్
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
గుంతకల్లు ఏపీడబ్ల్యూజే కార్యాలయంలో సోమవారం ఏపీడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని మండల తహసిల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఏపీడబ్ల్యుజే అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.


