NTR: కంచికచర్ల మండలంలోని ఎన్టీఆర్ జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కళాశాలలో 230 మంది విద్యార్థులు చదువుతున్నారని, సరిపడా తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకురాలు షేక్ జాహిద తెలిపారు. వర్షాకాలంలో కళాశాలకు వెళ్లే రహదారి బురదమయంగా మారుతోందని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
కాలేజ్ సమస్యలు పరిష్కరించాలని వినతి


