హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రైవేట్ విద్యా వాహనాలపై చర్యలు తీసుకోవాలి'

W.G: ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాల్లో నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని SFI పశ్చిమగోదావరి జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. వాహనాల సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం, ఫిట్నెస్ లేని వాహనాలు నడపడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ డిమాండ్ చేశారు.