హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.15 లక్షలతో రోడ్డు పనులకు శ్రీకారం

CTR: కుప్పం(M) కంగుంది గ్రామపంచాయతీ కౌజుగానిపల్లి సమీపంలోని భూషన్నకోటలకు రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ CM చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.