హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతబాబుకు కోర్టు‌లో ఎదురు దెబ్బ!

E.G: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. శాసనమండలి సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరగా, న్యాయస్థానం నిరాకరించింది. దీంతో అనంతబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.