GNTR: అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మొత్తం 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో 97 పనులు ప్రారంభమయ్యాయని, 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. అమరావతి కోసం రూ.41,187.70 కోట్ల రుణ సమీకరణకు చర్యలు చేపట్టగా, ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో 119 ప్రాజెక్టులు.. 97 పనులు షురూ


