హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ మేయర్ పీఠం కూటమిదే: MLA

VSP: సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అసెంబ్లీకి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చేయూతనివ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. డిసెంబర్ 29ని 'కాంట్రాక్టర్ల దినోత్సవం'గా ప్రకటించాలని సూచించారు. త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని, మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.