NLR: రాపూరు మండల టీడీపీ కార్యదర్శి పిల్లకదుపు నరేంద్ర యాదవ్, రాష్ట్ర MLC బీద రవిచంద్ర యాదవ్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక సంఖ్యలో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన MLCని కోరారు. దీనికి స్పందించిన బీద రవిచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బీసీ సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీ సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది'


