KKD: తుని మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఉన్న 30 వార్డులను 36కు పెంచుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీవో జారీ చేసింది. పట్టణ విస్తీర్ణం, జనాభా పెరుగుదలతో పాటు వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చు తగ్గుల నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికలు 36 వార్డుల ప్రాతిపదికన జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తుని మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంపు


