ప్రకాశం: కంభం నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు సోమవారం ఔరంగాబాద్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. వరి నార్లు వేసుకోండి.. నీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. అయితే నార్లు వేసిన తర్వాత కూడా నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో వరి రైతుల నిరసన...!


