హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గంజాయి విక్రయాలపై సమాచారం ఇవ్వాలి'

కోనసీమ: మండపేటలో ఆటో యూనియన్ సభ్యులకు డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఏఎస్ఐ ఎస్. అప్పారావు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు.