హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

SKLM: మందసలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మందస ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు. రచయిత రట్టి లింగరాజు జర్నలిస్టులు ప్రజల గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్.శ్రీనివాసరావు, కె. పూర్ణచందు, ఎన్.రామ్‌కుమార్ పాల్గొన్నారు.