హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

JN: పాలకుర్తి మండలం శాతపురం గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై పాడి గేదె మృతి చెందింది. రోజువారీగా మేతకు వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని విద్యుత్ వైర్లను తాకడంతో ఈ ఘటన జరిగినట్లు బాధిత రైతు గన్న యాకన్న తెలిపారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.