హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైనా దాడిలో లేగ దూడ మృతి

KNR: చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన రైతు ఎనగందుల రాజయ్యకు చెందిన లేగ దూడపై హైనా దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హైనా దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వం నుంచి బాధిత రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తోటి రైతులు అధికారులను కోరారు.