హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాబోయే రోజుల్లో సీఎం కు అండగా ఉంటాం'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు నిరుద్యోగులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్‌లో వయస్సు పెంచడం అనే నిర్ణయం సీఎం తీసుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు. అలాగే నిరుద్యోగులకు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామన్నారు.