హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 వేల కోళ్ల ఫారంపై తీవ్ర వ్యతిరేకత

NLG: పెద్దవూర (M) 50 వేల కోళ్ల ఫారం ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి, అల్వాల సహా పలు గ్రామాల ప్రజలు దుర్వాసన, ఈగలు, వ్యర్థాలు, నీటి కాలుష్యంతో పంటలు, పశువులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అనుమతులు ఉన్నా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఫారం ప్రాజెక్టును పునఃపరిశీలించాలని కోరుతున్నారు.