SRPT: ఇకపై ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలోనూ నిర్వహించనున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి జరగనుంది. దీంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
తెలంగాణ
నేడు మండలాల్లోనే ప్రజావాణి కార్యక్రమం


