హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

KMR: పిట్లంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఆవుపాలు, పసుపు, కుంకుమ, పూలతో ఆలయాలకు తరలివచ్చారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలు సమర్పించారు. అనంతరం పుట్టల వద్ద పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. నాగదేవతను దర్శించుకుని కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.