హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణ సోమవారం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్‌ నగరంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. విశేష అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.