హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. నిన్న శ్రీవారిని 97,014 మంది భక్తులు దర్శించుకోగా.. 37,108 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.