హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘మేము ఇంకా ఉన్నాం’ మేడారంలో హెచ్చరిక లేఖలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం ‘ఏటీపీహెచ్’ పేరుతో హెచ్చరిక లేఖలు కలకలం రేపాయి. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఉన్నప్పటికీ ఐటీడీఏ క్యాంపు కార్యాలయ గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు లేఖలు అంటించారు. ‘మేము ఇంకా ఉన్నాం.. హక్కుల కోసం బలంగా నిలబడతాం’ అంటూ పేర్కొన్నారు. పోలీసులు లేఖలను తొలగించి దర్యాప్తు చేపట్టారు.