హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా వాసి ఆత్మహత్య

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామానికి చెందిన గండి కామునాయుడు (40) విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కామునాయుడు ఉపాధి కోసం కుటుంబంతో పీఎంపాలెంకు వెళ్లాడు. తులసీనగర్ లేఅవుట్‌లో ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఉరివేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.