హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు భారీ ఆర్థిక సాయం

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే రూ.318 కోట్లు పంపిణీ కాగా, ఈనెల 24లోగా మొత్తం రూ.600 కోట్లు చెల్లించనున్నారు. నేటి నుంచి రోజుకు రూ.50 కోట్లు, 21 నుంచి 24 వరకు రోజుకు రూ.100 కోట్ల చొప్పున నిధులు జమ చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందే నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.