హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా పోతున్న తాగునీరు..!

NRPT: కోస్గి పట్టణంలోని 15వ వార్డు మోమిన్‌పేట్‌లో తాగునీటి సరఫరా చేసే బోరు మోటార్ వద్ద పైప్‌లైన్ లీకేజీతో గత 20 రోజులుగా నీరు వృథాగా పారుతోంది. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోతున్నా, మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.