హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనం ఢీకొని సాంబారు జింక మృతి

ప్రకాశం: గిద్దలూరు నంద్యాల ప్రధాన రహదారిపై దిగుమెట్ట స్టీల్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సాంబార్ జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలలో రాత్రివేళ వాహనాల్లో ప్రయాణించే వాహనదారులు వేగం నియంత్రణ చేసి అప్రమత్తంగా ప్రయాణించాలని అన్నారు.