హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

ప్రకాశం: పామూరు మండలంలోని గొట్లగూడూరు పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.