SS: రొద్దం మండలం దొడగట్ట గ్రామ శివార్లలో ఆదివారం జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ రాజకుళాయప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో 18 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జూద స్థావరంపై పోలీసుల దాడి


